బిడ్డతో తల్లికున్న బంధం కడుపులో(Mother's love starts in the womb)నే మొదలవుతుంది. తొమ్మిది నెలలపాటు తన కడుపులో ప్రాణం పోసుకున్న బిడ్డ భూమ్మీదకు రాగానే ఆ తల్లి ఎంతో సంతోషిస్తుంది. అప్పుడు మొదలు తను కన్నుమూసే వరకు కంటికిరెప్పలా కాపాడుకుంటుంది. పసిప్రాయంలో అయితే.. బిడ్డను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేదు. తన ప్రాణం కంటే మిన్నగా చూసుకునే చిన్నారిని తన నుంచి దూరం చేస్తే.. అప్పటివరకు శాంతమూర్తిగా ఉన్న ఆ అమ్మ ఒక్కసారిగా అపరకాళీ అవుతుంది. బిడ్డను తనకు దూరం చేసిన వారిపై కన్నెర్ర చేస్తుంది. తన కంటిపాప కోసం కునుకేయకుండా ఎన్నిరోజులైనా ఎదురుచూస్తుంది.
ఇలాంటి పరిస్థితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ తల్లికి ఎదురైంది. కానీ ఆమె ధైర్యం కోల్పోలేదు. తన బిడ్డను అమ్మేసిన భర్తపై కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. జిల్లా పాలనాధికారి చొరవతో బాలల సంరక్షణ అధికారులు ఆ చిన్నారిని వెతికి తల్లి చెంతకు చేర్చారు. పేగుబంధాన్ని గెలిపించారు. బిడ్డను తీసుకొచ్చి ఆ తల్లిప్రాణం నిలిపారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రూపిరెడ్డిపల్లికి చెందిన ఓ వ్యక్తికి ఇప్పటికే ఇద్దరు కుమారులుండగా.. భార్య ఇటీవల మరో బాబుకు జన్మనిచ్చింది. తాగుడు(alcohol addict)కు బానిసైన ఆ వ్యక్తి భార్యను బెదిరించి డబ్బు కోసం ఆ పసివాణ్ని అమ్మకాని(father sold his son)కి పెట్టాడు. హైదరాబాద్కు చెందిన పిల్లలు లేని ఓ జంటతో బేరం కుదుర్చుకున్నాడు. వారి నుంచి కొంత డబ్బు తీసుకుని వారం క్రితం పసికందు(father sold his son)ను అప్పగించాడు. కన్నతల్లి ఆవేదన అతనికి కనిపించలేదు.
బిడ్డపుట్టిన 45 రోజులకే తన నుంచి దూరమయ్యాడని ఆ కన్నతల్లి(Mother cried for her son) తల్లడిల్లింది. కన్నపేగు ఎడబాటును తట్టుకోలేక, పేగుబంధాన్ని వదులుకోలేక జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా(Jayashankar bhupalpally district collector Bhavesh Mishra) వద్దకు వెళ్లి తన కడుపుకోతను వివరించింది. భర్తపై ఫిర్యాదు చేసి(wife complain about husband) తన బిడ్డను వెతికిపెట్టి తనకు అప్పగించాలని కోరింది. కన్నతల్లి బాధను అర్థం చేసుకున్న కలెక్టర్ ఆ బాబును వెతికి ఆమెకు అప్పగించాలని జిల్లా బాలల సంరక్షణ అధికారులను ఆదేశించారు. వారు ఆ బాలుణ్ని కనుక్కొని కలెక్టర్ సమక్షంలో తల్లికి అప్పగించారు. పేగుబంధాన్ని నిలబెట్టారు. కన్నతల్లి ప్రేమను గెలిపించారు.
తన బిడ్డను తనకు అప్పగించిన బాలల సంరక్షణ అధికారులకు ఆ మహిళ కృతజ్ఞతలు తెలిపింది. తన బాధను అర్థం చేసుకుని బాబును వెతికించిన కలెక్టర్కు ధన్యవాదాలు చెప్పింది.