కుమారుడి మృతి.. తట్టుకోలేక ఆగిన తల్లి గుండె - జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాజా వార్తలు
19:40 July 14
కుమారుడి మృతి.. తట్టుకోలేక ఆగిన తల్లి గుండె
పిల్లలపై తల్లికి ఉండే ప్రేమ వెలకట్టలేనిది. తనను మరిచిపోయి పిల్లల గురించే ఆలోచిస్తుంది అమ్మ. బిడ్డ కడుపు నిండితే తన కడుపు నిండినంత సంబుర పడుతుంది అమ్మ.. మనం అలిగితే అమ్మ అల్లాడుతుంది. మనం నవ్వితే నవ్వుతుంది.. ఏడిస్తే ఏడుస్తుంది. మనమే ప్రపంచంగా బతుకుతుంది. అలాంటి ఓ అమ్మ తన కొడుకు మరణాన్ని తట్టుకోలేక ఊపిరి వదిలింది. దేవుడు తల్లీకొడుకుని విడదీసే ప్రయత్నం చేసినా వారి బంధం విడిపోలేదు.. వారి పేగు బంధం విడిపోలేదు.. ఇదీ విడదీయని పేగు బంధం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌లో అనారోగ్యంతో చికిత్స పొందుతూ కుమారుడు మృతి చెందాడు. కుమారుడి చాపు తట్టుకోలేక తల్లి గుండెపోటుతో మృతి చెందింది.
ఇదీ చదవండి:ఆ రాష్ట్రంలో కరోనా విజృంభణ- మళ్లీ లాక్డౌన్