తెలంగాణ

telangana

ETV Bharat / state

కొవిడ్ మృతదేహానికి అంత్యక్రియలు జరిపిన ఎమ్మెల్యే - ఎమ్మెల్యే గండ్ర వెెంకటరమణారెడ్డి

కరోనా.. బంధాలు, అనుబంధాలను దూరం చేస్తోంది. మనిషి చివరి చూపును కూడా.. నోచుకోకుండా చేస్తోంది. బంధుమిత్రులు.. మృతదేహాం దగ్గరకు రావడానికే జంకుతున్నారు. జయశంకర్​ జిల్లా కేంద్రంలో ఇలాగే అంత్యక్రియలు జరపడానికి గ్రామస్థులు నిరాకరించడంతో.. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి చొరవతో కొవిడ్ మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించారు.

funeral for covid dead body
funeral for covid dead body

By

Published : May 21, 2021, 9:24 AM IST

కొవిడ్ మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించడానికి గ్రామస్థులెవరూ ముందుకు రావడంతో.. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ఆ బాధ్యతలు చేపట్టారు. జయశంకర్​ జిల్లా కేంద్రంలోని బాంబులగడ్డ శ్మశాన వాటికలో రేగొండకు చెందిన కొవిడ్ మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.

వైరస్​తో మృతి చెందినవారి అంత్యక్రియలకు దూరంగా ఉండటం సమంజసం కాదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలను ఆదరిస్తూ.. సామాజిక బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. కనీసం దహనసంస్కారలైన నిర్వహించాలన్నారు. మహమ్మారి పట్ల ప్రజలందరూ జాగ్రత్త వహించాలని సూచించారు.

ఇదీ చదవండి:కరోనా సెకండ్‌వేవ్‌లో 10శాతం వరకు చిన్నారులపై ప్రభావం

ABOUT THE AUTHOR

...view details