జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి సందర్శించారు. ఆరోగ్య సేవలపై ఆరా తీశారు. చికిత్స కోసం వచ్చిన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కరోనా పాజిటివ్ అని తేలిన వారు హోమ్ ఐసోలేషన్ లేదా ఐసోలేషన్ కేంద్రాల్లో ఉండాలని సూచించారు. అందరూ ధైర్యంగా ఉండాలని, అత్యవసరమైతేనే ఆస్పత్రికి రావాలని అన్నారు.
'ధైర్యంగా ఉండాలి.. అత్యవసరమైతేనే ఆస్పత్రికి రావాలి' - తెలంగాణ వార్తలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి పర్యటించారు. స్థానికంగా నిర్వహిస్తున్న కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు. ప్రజలంతా ధైర్యంగా ఉండి... అత్యవసరమైతేనే ఆస్పత్రికి రావాలని సూచించారు.
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, రేగొండ పీహెచ్సీ
రోజూ నిర్దిష్ట సమయాన్ని కేటాయించి కరోనా పరీక్షలను నిర్వహించాలని సూచించారు. పరీక్షా కేంద్రానికి దూరంగా వ్యాక్సిన్ ఇవ్వాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వైద్య సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.