తెలంగాణ

telangana

ETV Bharat / state

ముదిరాజ్​ల సంక్షేమానికి పెద్దపీట: ఎమ్మెల్యే గండ్ర - జయశంకర్​ భూపాలపల్లి జిల్లా తాజా వార్త

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని గణపసముద్రం చెరువులో సుమారు 13 లక్షల చేపపిల్లలను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వదిలారు. మత్స్యకారులకు వలలతో పాటు సేఫ్టీ జాకెట్లను పంపిణీ చేశారు.

Mla gandra venkataramana reddy fish seed released in Ganapa Samudram pond at Ganapura in Jayashankar district
గణపసముద్రం చెరువులో సుమారు 13లక్షల చేపపిల్లల విడుదల

By

Published : Aug 31, 2020, 3:28 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజ్​ల కులవృత్తిని ప్రోత్సహిస్తోందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని గణపసముద్రం చెరువులో 13.16 లక్షల చేపపిల్లలను విడుదల చేశారు. 21 మంది మత్స్యకారులకు వలలతో పాటు సేఫ్టీ జాకెట్లను పంపిణీ చేశారు. మరో 30 లక్షల చేప పిల్లలను ముఖ్యమంత్రి, సంబంధిత శాఖ మంత్రితో మాట్లాడి ఇప్పిస్తానని గండ్ర హామీ ఇచ్చారు.

ఇటీవల కురిసిన అకాల వర్షాలతో జరిగిన పంట నష్టంపై సర్వే చేశామని, మిగిలిన నష్టాన్ని కూడా అంచనా వేసి పరిహారం అందేలా కృషి చేస్తానని తెలిపారు. ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి:శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకున్న హైకోర్టు సీజే మహేశ్వరి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details