అన్ని రంగాల్లో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. కల్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకాలు ఆడపిల్లలకు అండగా నిలిచాయని వివరించారు. భూపాలపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశమై.. ఘనపూర్ మండలంలోని 91 మంది లబ్ధిదారులకు చెక్కలను అందజేశారు.
'కల్యాణ లక్ష్మి చెక్కులు అందించిన ఎమ్మెల్యే'
భూపాలపల్లి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఘనపూర్ మండలంలోని 91 మంది లబ్ధిదారులకు సాయాన్ని అందజేశారు.
కల్యాణ లక్ష్మి చెక్కులు
పెళ్లి జరిగే ప్రతి ఇంటిని సీఎం కేసీఆర్ ఓ తండ్రిగా, మేనమామగా ఆర్థికంగా అందుకుంటున్నారని ఎమ్మెల్యే వివరించారు. ముఖ్యమంత్రికి నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి:రైతు సంక్షేమమే కేసీఆర్ సర్కార్ ధ్యేయం : మంత్రి ఈటల