జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి పంపిణీ చేశారు. భూపాలపల్లి, గణపురం మండలాలకు చెందిన 171 మందికి రూ. 8 కోట్ల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ సెగ్గం వెంకట రాణి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
171 మందికి రూ. 8 కోట్ల చెక్కుల పంపిణీ - ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి వార్తలు
జయశంకర్ భూపాలపల్లిలో 171 మందికి రూ.8 కోట్ల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి పంపిణీ చేశారు. ఇంత పెద్ద మొత్తంలో చెక్కుల పంపిణీకి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భూపాలపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
171 మందికి రూ. 8 కోట్ల చెక్కుల పంపిణీ
కరోనా నేపథ్యంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో కొంత ఆలస్యం జరిగినా.. ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇంత పెద్ద మొత్తంలో చెక్కుల పంపిణీకి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భూపాలపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో మిగిలిన వారికీ చెక్కులు పంపిణీ చేస్తామని వెల్లడించారు.