జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచ గ్రామంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డివరి, మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అన్నదాతలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. రైతులు పండించిన పంట తమ గ్రామంలోనే అమ్ముకునే విధంగా ప్రభుత్వం తరఫున ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర - mla gandra venkata ramanareddy
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొడవటంచ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యంలో తాలు, తేమ లేకుండా కేంద్రాల వద్దకు తీసుకురావాలని కోరారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర
జయశంకర్ జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యం, మొక్కజొన్నలను వరంగల్, పెద్దపల్లి జిల్లాలకు పంపి ని తెలియజేశారు. రైతులు పండించిన ధాన్యంలో తాలు,తేమ లేకుండా కేంద్రాల వద్దకు తీసుకురావాలని కోరారు. వ్యవసాయ అధికారులు చెప్పిన విధంగా నడుచుకుంటూ వారికి సహకరించాలని కోరారు.
ఇవీ చూడండి: కొహెడ పండ్ల మార్కెట్‌ను పరిశీలించిన మంత్రులు