తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎమ్మెల్యే గండ్ర - Latest news in Telangana

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రైవేటు టీచర్లకు ఆర్థిక సహయం కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉందని పేర్కొన్నారు.

mla gandra
mla gandra

By

Published : Apr 22, 2021, 8:38 PM IST

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా ఎల్బీనగర్​లోని బైరెడ్డి లక్ష్మారెడ్డి డీలర్​ షాప్​లో ప్రైవేటు టీచర్స్​, నాన్​ టీచింగ్ స్టాఫ్​కి ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గండ్ర వెంకట రమణారెడ్డి పాల్గొన్నారు.

కరోనా వ్యాక్సిన్ వచ్చింది... కరోనా తగ్గుముఖం పట్టింది.. విద్యాసంస్థలు ప్రారంభించుకున్నాం.. అనుకునే క్రమంలో కరోనా సెకండ్ వేవ్​ మొదలు కావడంతో మళ్లీ విద్యాసంస్థలు మూతపడ్డాయని ఎమ్మెల్యే అన్నారు. దానితో చిన్నపాటి ఉద్యోగులైన పాఠశాల టీచర్స్​, నాన్​ టీచింగ్ స్టాఫ్​ల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారని వెల్లడించారు. ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఎవరూ అధైర్య పడవద్దని, ప్రభుత్వ సూచనలు పాటించాలని కోరారు.

ఇవీచూడండి:పుర ఎన్నికల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరణ

ABOUT THE AUTHOR

...view details