జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ జిల్లా, మండల అధికారులతో శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని గ్రామాల్లో రైతులకు కావాల్సిన ఎరువులను వెంటనే అందుబాటులో ఉంచాలని తెలిపారు. రైతు వేదికలను దసరా పండుగకు ముందే పూర్తి చేయాలని ఆదేశించారు.
దసరాకు ముందే రైతు వేదికలు పూర్తిచేయాలి: ఎమ్మెల్యే గండ్ర
దసరాకు ముందే రైతు వేదికలను పూర్తి చేయాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో వ్యవసాయాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
mla gandra venkata ramana reddy review with agriculture officers
రైతులకు వ్యవసాయ రంగంపై సూచనలు చేయాలన్నారు. అన్ని మండలాల్లోని ఏవోలు, ఏఈవోలు రైతులకు అందుబాటులో ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫీఏసీఎస్ ఛైర్మన్ భూపాలపల్లి మేకల సంపత్, జిల్లా వ్యవసాయ శాఖాధికారి సత్యంబాబు పాల్గొన్నారు.