రాష్ట్రంలో ముదిరాజుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. పథకాలన్నింటిని వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలని కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగోండ మండలం నిజాంపల్లిలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
'ముదిరాజుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది' - jayashanker bhupal pally news
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగోండ మండలం నిజాంపల్లిలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.
mla gandra venkata ramana reddy participated in temple inauguration
ముదిరాజుల ఆరాధ్య దేవత శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ జరుపుకోవడం చాలా సంతోషకరమని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో రేగోండ మండలం జడ్పీటీసీ సాయిని విజయ ముత్యం, ఎంపీపీ పున్నం లక్ష్మీ రవి, మొగుళ్ళపల్లి జడ్పీటీసీ జోరుక సదయ్య, మండల పార్టీ ప్రెసిడెంట్ ఉమేశ్ గౌడ్, పీఏసీఎస్ ఛైర్మన్ విజ్జన్ రావు తదితరులు పాల్గొన్నారు.