జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వాస్పత్రిలో కలెక్టర్ ప్రత్యేక చొరవతో మంజూరు చేసిన అంబులెన్స్‌ను ఎమ్మెల్యే చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించారు. అంబులెన్స్‌లో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు.
'కరోనాపై పోరాటంలో వైద్యుల కృషి అభినందనీయం' - భూపాలపల్లిలో అంబులెన్స్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబులెన్స్‌ను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ప్రారంభించారు. ప్రజా పరిరక్షణే ధ్యేయంగా వైద్యాధికారులు, జిల్లా యంత్రాంగం నిరంతరం పనిచేస్తున్నారని ఎమ్మెల్యే కొనియాడారు.
ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా వైద్యారోగ్య శాఖ అధికారులు నిరంతరం పనిచేస్తున్నారని.. అదేవిధంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక ద్వారా చర్యలు తీసుకోవడం అభినందనీయమని కొనియాడారు. కరోనా బాధితులు, గర్భిణులు. క్షతగాత్రులకు అంబులెన్స్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ ఛైర్పర్సన్ షెగ్గం వెంకటరాణి, వైస్ ఛైర్మన్ కొత్త హరిబాబు, డీఎంహెచ్ఓ డా.సుధార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:Fire Accident: కారులో చెలరేగిన మంటలు.. డ్రైవర్ సేఫ్