సీఎం కేసీఆర్ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి పేర్కొన్నారు. భూపాలపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన కేసీఆర్ పాలనను కొనియాడారు.
బుద్ధి చెప్తారు..
ప్రత్యేక రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ అన్ని వర్గాలను ప్రజలను ఏకతాటిపై తీసుకువచ్చాడని తెలిపిన ఆయన.. ఇటీవల ముఖ్యమంత్రిపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. భాజపా నాయకులు నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు.