జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో ఎన్ఎస్ఆర్ డైరీ సంస్థల ప్రతినిధి సంపత్ రావు సహకారంతో ఆశా వర్కర్లకు, పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి నిత్యావసర సరుకులను అందజేశారు. దాదాపు 200 మందికి బియ్యం, పప్పు, నూనెలను పంపిణీ చేశారు.
పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల అందజేత
లాక్డౌన్ సమయంలోనూ ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్న ఆశా కార్యకర్తలకు, పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి నిత్యావసర సరుకులు అందజేశారు. లాక్డౌన్ పూర్తయ్యేవరకూ ప్రజలెవరూ ఇళ్లలోంచి బయటకు రాకూడదని సూచించారు.
పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల అందజేత
కరోనా సమయంలోనూ పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించడం ప్రశంసనీయమన్నారు. లాక్డౌన్ పూర్తయ్యేవరకూ ప్రజలెవరూ ఇళ్లలోంచి బయటకు రాకూడదని సూచించారు. అత్యవసర సమయాల్లో బయటకి వస్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మీ, జడ్పీటీసీ విజయ, పీఏసీఎస్ ఛైర్మన్ విజ్ఞాన్ రావు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:ధాన్యం సేకరణలో అగ్రస్థానంలో తెలంగాణ: కేటీఆర్