జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలోని విద్యార్థులకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి సైకిళ్లను పంపిణీ చేశారు. ఉపాధ్యాయులు పిల్లలకు మెరుగైన విద్యను అందించాలని సూచించారు.
విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి వార్తలు
కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు ఉండే విధంగా ఉపాధ్యాయులు విద్యాబోధన చేయాలని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి సూచించారు. అనంతరం రేగొండ మండలం జడ్పీహెచ్ పాఠశాలలో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు.
విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతవరణం ఉండేలా శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు ఉండే విధంగా ఉపాధ్యాయులు కృషిచేయాలని సూచించారు. ఇబ్బందులేమైనా తన దృష్టికి తీసుకువస్తే జిల్లా అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేశారు.