జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల ఆవరణలో సంత్ సేవాలాల్ మహారాజ్ 282వ జయంత్యుత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గిరిజనులు ఎంతో పవిత్రంగా జరుపుకునే సేవాలాల్ జయంతి వేడుకలకు హాజరవడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. వేడుకలో గిరిజనుల ఆచారాలను పాటించిన ఆయన.. వారి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే గండ్ర - సంత్ సేవాలాల్ మహారాజ్ జయంత్యుత్సవాలు
భూపాలపల్లి కేంద్రంలో సంత్ సేవాలాల్ మహారాజ్జయంత్యుత్సవాలు, లారీ అసోసియేషన్ పాలక వర్గ ప్రమాణ స్వీకారానికి.. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అసోసియేషన్ క్యాలెండర్ను ఆవిష్కరించారు.
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి
అనంతరం లారీ అసోసియేషన్ పాలక వర్గం ప్రమాణ స్వీకారానికి హాజరై.. క్యాలెండర్ను ఆవిష్కరించారు.
ఇదీ చదవండి:'కేసీఆర్ పుట్టిన రోజున రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు'