సంక్షేమ పథకాలే.. సహకార సంఘాల విజయానికి కృషిచేశాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జయశంకర్ జిల్లాలోని జంగేడు సహకార సంఘం ఎన్నికలో గెలుపొందిన అభ్యర్థుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.
సంక్షేమ పథకాల విజయమే: గండ్ర వెంకటరమణారెడ్డి - mla gandra commented on PACS VICTORY
రైతు బీమా, రైతు బంధు, 24 గంటల విద్యుత్ వంటి పథకాలు.. సహకార సంఘాల ఎన్నికల్లో విజయానికి కృషిచేశాయని గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జంగేడు సహకార సంఘం ఎన్నికలో గెలుపొందిన అభ్యర్థుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.
సంక్షేమ పథకాల విజయమే: గండ్ర వెంకటరమణారెడ్డి
జిల్లాలోని అన్ని సంఘాల్లోనూ తెరాస మద్దతుదారులు గెలవడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం పట్ల రైతులకు ఎంతో నమ్మకముంటేనే ఇది సాధ్యపడుతుందన్నారు. రైతు బీమా, రైతు బంధు, 24 గంటల విద్యుత్ వంటి పథకాలు.. సహకార సంఘాల విజయానికి కృషిచేశాయని అభిప్రాయపడ్డారు. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు రైతుల సంక్షేమం కోసం పనిచేయాలని సూచించారు.
ఇవీచూడండి:ప్రగతిభవన్లో మంత్రివర్గ సమావేశం .. కీలక అంశాలపై చర్చ!