తెలంగాణ

telangana

ETV Bharat / state

సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

జయశంకర్​ భుపాలపల్లి జిల్లా సింగరేణి ఇల్లందు క్లబ్​ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పురపాలక సంఘం సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో పదహారు అంశాలపై చర్చ జరిగింది. సమావేశానికి గైర్హాజరైన అధికారులు, సభ్యుల పట్ల ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.

mla gandra participated in muncipal meeting
సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

By

Published : Aug 18, 2020, 6:40 PM IST

జయశంకర్​ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని సింగరేణి ఇల్లందు క్లబ్​ కార్యాలయంలో భూపాలపల్లి పురపాలక సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఎజెండాలో ప్రవేశ పెట్టిన 16 అంశాలపై సుధీర్ఘ చర్చ చేశారు. పట్టణంలో నిర్మించ తలపెట్టిన 12 పబ్లిక్​ టాయ్​లెట్స్​ కోసం.. రూ.12 లక్షల 21,500 అంచనా వ్యయం కాగా.. ఎలాంటి టెండర్లు లేకుండా సింప్లీ జిత్​ ఇన్వెస్ట్​మెంట్​ కార్పొరేషన్​ వారికి రూ.48 లక్షల 86 వేలు కలెక్టర్​ ఆదేశానుసారం చెల్లించారు. ఈ విషయమై సమావేశంలో చర్చ జరగగా.. కౌన్సిల్​ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ్యులకు సమాచారం లేకుండా, అనుమతులు లేకుండా, టెండర్లు పిలవకుండా ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తారని ప్రశ్నించారు. అధికారాన్ని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన మున్సిపల్​ అధికారులపై చర్యలు తీసుకోవాలని, అడ్వాన్స్​గా ఇచ్చిన నగదును తిరిగి వసూలు చేయాలని సర్వసభ్య సమావేశం తీర్మానం చేసింది.

మున్సిపల్​ సర్వసభ్య సమావేశంలో ప్రవేశ పెట్టిన 16 అంశాలలో 15 అంశాలకు ఆమోదించామని, పబ్లిక్​ టాయ్​లెట్ల నిర్మాణానికి నిధుల కేటాయింపులో జరిగిన అవకతవకలపై వెంటనే వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అడిషనల్​ కలెక్టర్​, మున్సిపల్​ కమిషనర్​ను ఆదేశించారు. సమావేశానికి గైర్హాజరైన అధికారులు వివరణ ఇవ్వాలని, జిల్లా అధికారులందరూ హెడ్​ క్వార్టర్​లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్​ ఛైర్మన్​, వైస్​ ఛైర్మన్​, కౌన్సిలర్లు, మున్సిపల్​ అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :పిల్లల అమ్మకాలకు ఏజెంట్​ వ్యవస్థ.. 'సృష్టి'oచిన ఆసుపత్రి

ABOUT THE AUTHOR

...view details