ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే - MLA Gandra opened grain purchasing centers
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గండ్ర ప్రారంభించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముస్లింలకు రంజాన్ గిఫ్ట్ ప్యాక్లను పంపిణీ చేశారు.
![ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే Jayashankar Bhupalpally District](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-06:12:48:1619613768-tg-wgl-47-28-mla-programe-av1-ts10069-2804digital-1619612839-517.jpg)
Jayashankar Bhupalpally District
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే గండ్ర ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముస్లింలకు రంజాన్ గిఫ్ట్ ప్యాక్లను పంపిణీ చేశారు. అదే విధంగా మొగుళ్లపల్లి మండలంలోని మార్కెట్ యార్డ్, కోర్కిశాల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదరులకు రంజాన్ కానుకగా అందిస్తున్న గిఫ్ట్ ప్యాక్లను, ప్రైవేటు టీచర్లకు 2వేల రూపాయలు, సన్నబియ్యాన్ని అందజేశారు.