జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దమ్మన్నపేట గ్రామం నుంచి రంగయ్యపల్లె గ్రామం వరకు 2 కోట్ల 40 లక్షల బీటి రోడ్డు, కొడవటంచ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో కల్యాణ మండపం షెడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శంకుస్థాపన చేశారు. వచ్చే నెల 4 నుంచి 11 వరకు శ్రీలక్ష్మీ నరసింహస్వామి జాతర జరుగనుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గండ్ర - MLA Gandra laid the foundation for development works
భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి శంకుస్థాపన చేశారు. వచ్చే నెలలో జరుగనున్న కొడవటంచ లక్ష్మీనరసింహ స్వామి జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు తెలిపారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గండ్ర
జాతర సమయంలో భక్తులకు తాగునీటి సమస్య, వైద్యం, ట్రాఫిక్, ఇతర సమస్యలు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం మిషన్ భగీరథ తాగునీటి నల్లాలు ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వివిధ గ్రామాల సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :'సమస్యలను పరిష్కరించకుండా.. తాత్సారం చేయడం తగదు'