జయశంకర్ భూపాలపల్లి జిల్లా కుందురుపల్లె ఏఎస్ఆర్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ హాజరయ్యారు. పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమనికి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జెడ్పీ ఛైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని, జిల్లా కలెక్టర్ అబ్దుల్ అజిమ్, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి - మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తాజా వార్త
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కుందురుపల్లెలో పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి
పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుకు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని మంత్రికి శాలువా కప్పి సన్మానించారు.