తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఫ్రెండ్లీ పోలీస్ అంటే దొంగలతో దోస్తీ కాదు' - భూపాలపల్లిలో మంత్రి సత్యవతి రాఠోడ్

ఫ్రెండ్లీ పోలీస్ అంటే నేరస్తులను పక్కన కూర్చొబెట్టుకోవడం కాదు... అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని మంత్రి సత్యవతి రాఠోడ్‌ అన్నారు. సఖి సెంటర్లు బాధితులకు అండగా నిలవాలని సూచించారు.

minister sathyavathi ratode participated in bhupalapally pattana pragathi
'ఫ్రెండ్లీ పోలీస్ అంటే దొంగలతో దోస్తీ కాదు'

By

Published : Mar 4, 2020, 9:17 PM IST

ఫ్రెండ్లీ పోలీస్ అంటే దొంగలతో దోస్తీ కాదని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్‌ అన్నారు. జయంశంకర్ భూపాలపల్లిలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సఖి సెంటర్‌ను ఆమె ప్రారంభించారు. సఖి సెంటర్లు బాధితులకు అండగా నిలవాలని సూచించారు.

ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. నేరస్తులను పక్కన కూర్చొబెట్టుకోకుండా కఠినంగా శిక్షించాలని పోలీసులను ఉద్దేశించి అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అబ్దుల్ అజీమ్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ, మున్సిపల్ ఛైర్‌పర్సన్స్‌ శ్రీహర్షిణి, వెంకటరాణి పాల్గొన్నారు.

'ఫ్రెండ్లీ పోలీస్ అంటే దొంగలతో దోస్తీ కాదు'

ఇదీ చూడండి:మాజీ సర్పంచి గారూ.. కొత్త సర్పంచిని ఎన్నుకోనివ్వండి

ABOUT THE AUTHOR

...view details