తెలంగాణ సగభాగానికి గోదావరి జలాలను కాళేశ్వరమే అందిస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరానికి ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి... పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్టమధు, జయశంకర్ జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణితో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
'తెలంగాణ సగభాగానికి కాళేశ్వరమే గోదావరి జలాలు అందిస్తోంది'
మంత్రి కొప్పుల ఈశ్వర్ కాళేశ్వరంలో పర్యటించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శన అనంతరం శాలువతో సత్కరించి... స్వామివారి చిత్రపటాన్ని అందించారు.
గర్భగుడి ప్రవేశం చేసిన మంత్రి ద్విలింగాలకు జలాభిషేకాలు నిర్వహించారు. అనంతరం శివకళ్యాణం మండల ఆవరణలో మంత్రికి శాలువా కప్పి సన్మానించి, స్వామి వారి చిత్రపటాన్ని ఆలయ అధికారులు అందజేశారు. గతంలో నిరాదరణకు గురైన ఆలయాలు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అభివృద్ధి చెందాయని మంత్రి తెలిపారు. ఓవైపు మహా క్షేత్రం, మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పదనంతో ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ వసంత, ఎంపీటీసీ మమత, పీఏసీఎస్ ఛైర్మన్ చల్ల తిరుపతి, నాయకులు మోహన్ రెడ్డి, అడుప సమ్మయ్య, కె.రాంరెడ్డి పాల్గొన్నారు.