ఆచార్య జయశంకర్ 86 జయంతి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆయన విగ్రహానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, జడ్పీ ఛైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో ఆచార్య జయశంకర్ కీలకంగా వ్యవహరించారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. భూపాలపల్లి జిల్లాకు ఆచార్య జయశంకర్ పేరుపెట్టడం సంతోషంగా ఉందన్నారు.
ఆచార్య జయశంకర్‌కు నివాళులర్పించిన మంత్రి ఎర్రబెల్లి - minister errabelli participated in professor jayashankar jayanthi
భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఆచార్య జయశంకర్ జయంతి వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ కీలకంగా వ్యవహరించారని.. ప్రస్తుతం ఆయన బతికుంటే ఎంతో సంతోషించేవారని మంత్రి తెలిపారు. భూపాలపల్లికి ఆయన పేరు పెట్టడం సంతోషంగా ఉందన్నారు.
ఆచార్య జయశంకర్‌కు నివాళులర్పించిన మంత్రి ఎర్రబెల్లి
ఇవీ చూడండి: నేడు తెలంగాణ సిద్ధాంతకర్త జయంతి