తెలంగాణ వస్తే చీకటిమయం అవుతుందని కొందరు ప్రగల్భాలు పాలికారని, దానిని ఛాలెంజ్‌గా తీసుకుని 24 గంటల విద్యుత్‌ను అందిస్తున్నామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో తెరాస పార్టీ ఆధ్వర్యంలో కాకతీయ కాలనీ నుంచి జంగెడు వరకు ర్యాలీ నిర్వహించారు.
రాష్ట్రం ఏర్పడక ముందు కరెంట్ సరిగ్గా లేక తీవ్ర అవస్థలు ఎదుర్కొనేవారని... ఇప్పుడు అలాంటి పరిస్థితి నుంచి విముక్తి కలిగిందని ఎర్రబెల్లి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన మిషన్ భగీరథని ఎంతో మంది ఎద్దేవా చేశారని, ఇప్పుడు నీళ్లొస్తుంటే అందరూ నోళ్లు ముసుకున్నారన్నారు.