తెలంగాణ

telangana

ETV Bharat / state

లక్ష్మీ బ్యారేజీ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల - godavari

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాణహిత ఉద్ధృతంగా ప్రవహిస్తుండడం వల్ల లక్ష్మీ బ్యారేజీకి భారీగా వరద పోటెత్తుతోంది. లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీలో 87 గేట్లకు గానూ 57 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.

medigadda-gates-open-in-jayashankar-bhupalpally-district
లక్ష్మీ బ్యారేజీ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

By

Published : Aug 13, 2020, 4:31 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మహారాష్ట్ర, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రాణహిత నది ఉద్ధృతితో ప్రవహిస్తుండటం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజికి భారీగా వరద పోటెత్తుతోంది. బ్యారేజిలో 85 గేట్లకు గానూ 57 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి 57 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.

ఎగువ ప్రాంతం నుంచి 3లక్షల 50 వేల క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తుండగా... 3లక్షల 24 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. మేడిగడ్డ సామర్థ్యం 16.17 టీఎంసీలకు గానూ 08.17 టీఎంసీల నీటిని నిల్వ ఉంచారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు నిండుగా ప్రవహిస్తున్నాయి. రెండు నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. వరద ప్రవాహం పుష్కర ఘాట్లను తాకుతూ ప్రవహిస్తోంది. కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద 8.170 మీటర్ల మేర వరద నీరు ప్రవహిస్తోంది.

ఇవీ చూడండి: రెండ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

ABOUT THE AUTHOR

...view details