తెలంగాణ

telangana

ETV Bharat / state

మేడిగడ్డపై అధికారుల దృష్టి, దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మతులు! - కాళేశ్వరం ప్రాజెక్ట్ తాజా వార్తలు

Medigadda Barrage Issue Update: కొన్ని రోజుల క్రితం కాళేశ్వరం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వంతెన కొంతమేర కుంగిపోవడం రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. దీంతో మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించి పనులు, మరమ్మతులపై ఎల్‌ అండ్‌ టీ సంస్థ ప్రతినిధులు దృష్టి సారించారు. బ్యారేజీలోని దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మతులకు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కాళేశ్వరం జలశాయంలోని అన్ని బ్యారేజిలు ఖాళీ అయ్యాయి.

Medigadda Barrage Damage at Bhupalaplly
Medigadda Barrage Issue Update

By ETV Bharat Telangana Team

Published : Nov 6, 2023, 3:01 PM IST

Medigadda Barrage Issue Update: మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించి పనులు, మరమ్మతులపై ఎల్‌ అండ్‌ టీ సంస్థ ప్రతినిధులు దృష్టి సారించారు. బ్యారేజీలోని దెబ్బతిన్న ప్రాంతాల్లో పనులు నిర్వహణకు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కాళేశ్వరం జలాశయంలోని అన్ని బ్యారేజిలు ఖాళీ అయ్యాయి. బ్యారేజిలో నీటి నిల్వ తగ్గింపు చేసిన అధికారులు.. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న నీటిని ఏడో బ్లాక్​కు తాకకుండా మళ్లింపు చేస్తున్నారు. పై నుంచి 26వేల500 క్యూసెక్కుల ప్రవాహం రాగా.. 57గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.

10 రోజులుగా గేట్లను ఎత్తివేస్తున్న అధికారులు.. దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇటీవలబ్యారేజీకి సంబంధించి రెండు పియర్ల వద్ద బుంగలు ఏర్పడడంతో అప్రమత్తమైన ఇంజినీరింగ్ అధికారులు.. తాత్కాలికంగా కట్టడి చేశారు. కొన్ని రోజుల నుంచి 10, 8, 7 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండగా ఆదివారం సాయంత్రం ఒక్క గేటుకు పరిమితం చేశారు. దీంతో దిగువకు స్పల్పంగా ప్రవాహం వెళ్లింది.

Medigadda Barrage Issue Update : 'మేడిగడ్డ జలాశయాన్ని ఖాళీ చేస్తున్న అధికారులు.. ప్రాజెక్ట్ వద్దకు విపక్షాలకు నో ఎంట్రీ'

Medigadda Barrage Damage at Bhupalaplly: కొన్ని రోజుల క్రితం కాళేశ్వరం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ (Medigadda Barrage) వంతెన కొంతమేర కుంగిపోవడం రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. శనివారం రోజు సాయంత్రం భారీ శబ్దంతో బీ-బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య వంతెన ఒక అడుగు మేర కుంగిపోయింది. బ్యారేజీ 20వ పిల్లర్ కుంగడంతోనే పైన వంతెన కూడా కుంగి పోయింది.బ్యారేజీ పొడవు 1.6 కిలో మీటర్లు ఉండగా కుంగిన ప్రాంతం మహారాష్ట్రవైపు నుంచి 356 మీటర్ల సమీపంలో ఉంది. నీటి పారుదల శాఖ ఇంజినీర్లుడ్యామ్ పరిసరాల్లో అలర్ట్ ప్రకటించి. మహారాష్ట్ర- తెలంగాణ రాష్ట్రాల మధ్య బ్యారేజీపై రాకపోకలు నిలిపివేశారు.

Central Committee Inspected Medigadda Barrage : ఒకవైపు మేడిగడ్డ వివాదం ముగియక ముందే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన అన్నారం(సరస్వతి) బ్యారేజీ దిగువన సీపేజీ(బుంగలు) రావడం అధికారులను ఆందోళనకు గురి చేసింది. ఈ నేపథ్యంలోనే బ్యారేజీకి సంబంధించి బ్లాక్‌ బి-4లోని 38, 42 పియర్‌ల వద్ద వెంట్‌ ప్రదేశాలలో సీపేజీ(బుంగలు) రావటం మొదలయ్యాయి. రెండు చోట్ల బుంగలు ఎక్కువగా ఉండటంతో ఇంజినీర్లు తగిన చర్యలు చేపట్టారు. వాటిని అరికట్టేందుకు ముందు జాగ్రత్త చర్యగా రింగ్‌బండ్‌ వేశారు. దీంతో అధికారులు రెండు చోట్ల రెండు మూడు అంగుళాల మేర సీపేజీ ఉన్నట్లు పేర్కొన్నారు. ఇసుక తేలకపోవడంతో ప్రమాదం లేదని వారు వివరించారు. పడవల ద్వారా సీపేజీ ఏర్పడిన ప్రాంతాలకు చేరుకొని ఇసుక సంచులతో, బండ రాళ్లతో అడ్డుకట్ట వేశారు. సుమారుగా 2,000 బస్తాలను బుంగలపై వేసిన ఇంకా పరిస్థితి అదుపులోకి రాలేదు.

మేడిగడ్డ బ్యారేజీ ఘటన జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ లేవనెత్తిన అంశాలు, ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం

కాళేశ్వరానికి అసలేమైంది, మొన్న మేడిగడ్డ, నేడు అన్నారం బ్యారేజీ దిగువన రెండు చోట్ల బుంగలు

ABOUT THE AUTHOR

...view details