తెలంగాణ

telangana

ETV Bharat / state

వర్షాకాలంలోగా మేడిగడ్డ పునరుద్ధరణ కష్టమే - ఆందోళనలో నీటిపారుదల శాఖ - మేడిగడ్డ బ్యారేజీ సమస్య

Medigadda Barrage Issue Update : కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులు ఇప్పట్లో పూర్తవడం కష్టమేనని ఇంజినీరింగ్‌ అధికారుల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. గోదావరి మరో రెండు నెలల పాటు ప్రవాహం ఉండనుండగా తర్వాత మిగిలిదే మూడు, నాలుగు నెలలలేని అంచనావేస్తున్నారు. పునరుద్ధరణ పనులపై ఎల్అండ్​టీ తమ బాధ్యత కాదని తేల్చేయడంతో ఈ సమయంలో పనులు పూర్తికావని భావిస్తున్నారు. పనులు పూర్తి కాకుండానే నీళ్లు నిల్వ చేస్తే అసలుకే ప్రమాదం వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Ground Report on Medigadda Barrage Issue
Medigadda Barrage Issue Update

By ETV Bharat Telangana Team

Published : Dec 17, 2023, 7:14 AM IST

Updated : Dec 17, 2023, 8:26 AM IST

మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులపై నెలకొన్న సందిగ్ధత

Medigadda Barrage Issue Update : మేడిగడ్డ పునరుద్ధరణ తమ బాధ్యత కాదని గుత్తేదారు సంస్థ ఎల్అండ్​టీ స్పష్టం చేయడంతో వచ్చే ఏడాది వర్షాకాలంలోగా పనుల పూర్తిపై సందిగ్ధత నెలకొంది. పూర్తిచేయకుండా నీటిని నిల్వచేస్తే బ్యారేజీకి ప్రమాదం వాటిల్లే అవకాశముందన్న నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ హెచ్చరికలు నీటిపారుదల శాఖ అధికారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

నిర్మాణం పూర్తయిన తక్కువ సమయంలోనే దెబ్బతిన్న బ్యారేజీ పనులను గుత్తేదారు సంస్థ పూర్తిచేయని నేపథ్యంలో పనులను మీరే చేయాలంటూ ఎల్అండ్​టీకు మళ్లీ లేఖ రాయాలని నీటిపారుదల శాఖ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సంస్థ స్పందించకపోతే ఏం చేయాలన్నదానిపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయానికి వస్తామంటున్నారు.

Ground Report on Medigadda Barrage Issue : కాఫర్‌ డ్యామ్‌ నిర్మించి నీటిని మళ్లించి, ఏడో బ్లాక్‌ను పూర్తిగా వేరు చేస్తే కానీ అసలేమి జరిగిందో తెలియదు. ఇది తెలిస్తేనే పునరుద్ధరణకు ఏం చేయాలన్నదానిపై స్పష్టత వస్తుంది. ఇది జరగాలంటే నీటిని మళ్లించేలా ముందుగా కాఫర్‌డ్యాం నిర్మాణం పూర్తవ్వాలి. మరో రెండు నెలలపాటు మేడిగడ్డ వద్ద కొంత ప్రవాహం ఉంటుంది. ఆ తర్వాత 3, 4 నెలలు మాత్రమే సమయం మిగులుతుంది. ఇంత తక్కువ సమయంలో పూర్తిస్థాయిలో విచారణ పూర్తి చేసి, కారణం తెలుసుకొని, పునరుద్ధరణ పనిని పూర్తి చేయడం కష్టమే.

'ఇసుక మీద బ్యారేజీ కట్టడం వల్లే మేడిగడ్డ కుంగిపోయింది'

Kaleshwaram Project Issues : ఇది చేయకుండా నీటిని నిల్వచేస్తే మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉందని, రక్షణ లేకుండా గేట్లు ఎత్తి నీటిని వదిలినా ఎలాంటి సమస్య వస్తుందో చెప్పలేమని నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథార్టీ ఇప్పటికే హెచ్చరించింది. దెబ్బతిన్న పియర్స్‌కు సంబంధించిన నాలుగైదు గేట్లు ఆపరేట్‌ చేయకుండా మిగిలినవి చేస్తే, భారీ వరద వచ్చినప్పుడు ఏమవుతుందో చెప్పలేమని నీటిపారుదల శాఖ ఇంజినీర్లు భావిస్తున్నారు. కాంట్రాక్టు సంస్థ ఎల్అండ్​టీ బాధ్యత తీసుకోకుంటే ఏం చర్యలు తీసుకోవాలనే అంశంపై సమాలోచనలు జరుపుతున్నారు. అవసరమైతే బ్యారేజీ పునరుద్ధరణను మరో సంస్థకు అప్పగించైనా పూర్తి చేయాలని లేదంటే పెద్ద సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

'మేడిగడ్డ' ఘటనలో ఊహించని ట్విస్ట్ - పునరుద్ధరణ బాధ్యత ప్రభుత్వానిదే అంటూ నిర్మాణ సంస్థ లేఖ

Medigadda Barrage Damage Issue: మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకుంటామని కొత్త ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో విచారణ విచారణే పనికి పనే అన్న పంథాలో ముందుకెళ్తుందా మరేదైనా పద్ధతిని ఎంచుకుంటుందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. బ్యారేజీలో ఉన్న నీటిని ఖాళీ చేయడం వల్ల యాసంగిలో కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయలేని పరిస్థితి వస్తుందని వచ్చే ఖరీఫ్‌లో కూడా ఇలాంటి పరిస్థితే కొనసాగవచ్చని నీటిపారుదల శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

'మేడిగడ్డ బ్యారేజీ ఘటనలో నిజాలే చెప్పాం - నిరాధార ఆరోపణలు చేయలేదు'

మేడిగడ్డపై అధికారుల దృష్టి, దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మతులు!

Last Updated : Dec 17, 2023, 8:26 AM IST

ABOUT THE AUTHOR

...view details