Medigadda Barrage Cement blocks scattered: భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీ వద్ద సీసీ బ్లాక్లు (సిమెంట్ దిమ్మెలు) చెదిరిపో యాయి. గత జులైలో భారీవరదల కారణంగా గేట్ల దిగువన ఉన్న సిమెంట్ దిమ్మెలు ప్రవాహధాటికి కొంత దూరం కొట్టుకుపోయాయి. అప్పటి నుంచి గేట్లు ఎత్తి నీటిని దిగువకు పంపుతుండటంతో ఇవి పైకి కనిపించలేదు. ఇటీవల పూర్తిగా గేట్లను మూసివేసి కేవలం రెండింటిని ఎత్తి తక్కువ స్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో చెదిరిపోయిన సిమెంటు దిమ్మెలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మేడిగడ్డ బ్యారేజీ దిగువన చెల్లాచెదురుగా సిమెంట్ దిమ్మెలు - Cement blocks were scattered in Medigadda barrage
Medigadda Barrage Cement blocks scattered: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ మేడిగడ్డ బ్యారేజీ వద్ద సీసీ బ్లాక్ సిమెంట్ దిమ్మెలు చెదిరిపోయాయి. గత సంవత్సరం జులైలో భారీ వరదల కారణంగా గేట్ల దిగువన ఉన్న సిమెంట్ దిమ్మెలు ప్రవాహం ధాటికి కొట్టుకుపోయాయి. అప్పుడు నీటిని దిగువకు పంపడంతో అవి కనిపించలేదు. ఇటీవల అన్ని గేట్లు మూసివేసి రెండు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో చెదిరిపోయిన సిమెంట్ దిమ్మెలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
లక్ష్మీ మేడిగడ్డ బ్యారేజీ
గేట్ల దిగువన ప్రవాహ ఉద్ధృతి తట్టుకునేలా చేపట్టిన సీసీ బ్లాక్ నిర్మాణాలు వరద దెబ్బకు గతంలోనూ స్థానభ్రంశం చెందాయి. ఆ సమయంలో ఇంజినీరింగ్ అధికారులు వాటిని సర్దుబాటు చేశారు. ఈ ఏడాది వరద ప్రవాహా నికి మళ్లీ కొట్టుకుపోయాయి.. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ ల్లో ఇదే సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. ఇంజనీరింగ్ నిపుణుల ఆధ్వ ర్యంలో శాశ్వత పరిష్కారం చూపాల్సి ఉంది.
ఇవీ చదవండి: