మేడారంలో సమ్మక్క, సారలమ్మ చిన్న జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. రెండేళ్లకోసారి జరిగే పెద్ద జాతర మరుసటి సంవత్సరం ఈ చిన్న జాతర జరుగుతుంది. మాఘ శుద్ధ పౌర్ణమి తర్వాత వచ్చే బుధవారాన్ని పవిత్రంగా భావించి అర్చకులు మండమెలిగె పండుగ పేరుతో జాతరను జరుపుతారు. తెలంగాణ ఆదివాసీల సంప్రదాయాలకు అద్దం పట్టే ఈ జాతర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని అర్చకులు ఘనంగా పూజలు చేశారు. సమ్మక్క సారలమ్మ ఆలయాలను భక్తి శ్రద్ధలతో శుద్ధి చేశారు.
వివిధ ప్రాంతాల నుంచి భక్తులు...
మొదటి రోజుమేడారం పరిసరాలన్నిపెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులతో కిటకిటలాడాయి. జంపన్నవాగు, గద్దెల వద్ద భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. ఎండ తగలకుండా గద్దెల వద్ద అధికారులు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసిన భక్తులు గద్దెల చెంత పసుపు, కుంకుమలతో సమ్మక్క, సారలమ్మలకు పూజ చేసి బెల్లాన్ని కానుకగా సమర్పించారు. హైదరాబాద్, ముంబయి, ఛత్తీస్‌గఢ్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు జాతరకు తరలివచ్చారు. అమ్మల దర్శనం బాగా జరిగిందని...సౌకర్యాలు బాగున్నాయని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి:కీలక ఒప్పందాలు..ద్వైపాక్షిక చర్చలు