మేడారం చిన జాతర కోలాహలంగా జరుగుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వనదేవతల సన్నిధికి తరలి వస్తున్నారు. కుటుంబసమేతంగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. సమ్మక్క సారలమ్మల గద్దెల చెంత పసుపు కుంకుమలద్ది పూజలు చేశారు. బెల్లాన్ని కానుకగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
కరీంనగర్, వరంగల్, హైదరాబాద్‌తోపాటు....మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి కూడా భక్తులు జాతరకు భారీగా వస్తున్నారు. జాతరకొచ్చే భక్తులకు ట్రాఫిక్ ఇక్కట్లు లేకుండా... ఇబ్బందులు కలగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ భాస్కరన్ తెలిపారు.