ఎంపీడీవో కార్యాలయం ముందు ఎన్నికల విధుల కోసం ఏర్పాటు చేసిన 5 టెంట్లు, కుర్చీలు దగ్ధమైన సంఘటన జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా గణపురంలో చోటు చేసుకుంది. ఘటనలో రెండు ద్విచక్ర వాహనాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. మరో ద్విచక్ర వాహనం, ఓ కారు స్వల్పంగా కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు స్పష్టం చేశారు.
ఎన్నికల సిబ్బంది కోసం తెచ్చిన సామగ్రి అగ్గి పాలు - JAYASHANKER BHUPALAPALLY DISTRICT
జయశంకర్ భూపాల్ పల్లి జిల్లాలో ఎన్నికల సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన 5 టెంట్లు, కుర్చీలు కాలి బూడిదయ్యాయి. విద్యుదాఘాతం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
![ఎన్నికల సిబ్బంది కోసం తెచ్చిన సామగ్రి అగ్గి పాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3199548-thumbnail-3x2-fire.jpg)
కాలి బూడిదైన 5 టెంట్లు, కుర్చీలు