జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అన్నారం సమీపంలో నిర్మించిన ఆనకట్ట వద్ద వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పూజలు నిర్వహించి గేట్ స్విచ్చాన్ చేశారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా అన్నారం వద్ద బ్యారేజ్ నిర్మించారు. ప్రారంభ కార్యక్రమం అనంతరం.. మంత్రి గోదావరి నీటిలో జల పూజ నిర్వహించారు.
అన్నారం గేట్ స్విచ్ ఆన్ చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి - mahadevpur
కాళేశ్వరం నిర్మాణాల ప్రారంభోత్సవాలు ఎక్కడికక్కడే జరిగాయి. ప్రధానమైన కాళేశ్వరం, కన్నెపల్లి ప్రాజెక్టులను కేసీఆర్ ప్రారంభించగా.. మిగతాచోట్ల మంత్రుల చేతుల మీదుగా జరిగాయి.
స్విచ్ ఆన్ చేసిన నిరంజన్ రెడ్డి