అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడం కోసం మహాత్మా జ్యోతిబా పూలే విశేష కృషి చేశారని జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీసీల అభివృద్ధి అధికారి శైలజ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. అధికారులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మహిళల సమాన అవకాశాల కోసం పూలే ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు పూలే అని బీసీ సంక్షేమసంఘం నాయకుడు సత్యనారాయణ అన్నారు. బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు.