Kaleshwaram Temple: తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాణహిత పుష్కరాల సందర్భంగా ఆయన మహారాష్ట్రలోని సిరోంచ పుష్కరఘాట్ వద్ద నది మాతకు విశేష పూజలు చేశారు. ప్రాణహిత నదికి అర్ఘ్య ప్రదానం చేసి, సంప్రోక్షణ చేసుకున్నారు. అక్కడి నుంచి కాళేశ్వర ఆలయం రాజగోపురం వద్దకు చేరుకోగా.. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కాళేశ్వరంలోని ముక్తీశ్వర స్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. స్వామి వార్లకు ప్రత్యేక అభిషేకం చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించారు. కాళేశ్వర క్షేత్రం ప్రాశస్త్యం చాలా గొప్పదని దేవేంద్ర ఫడణవీస్ అన్నారు. దేశం సుభిక్షంగా ఉండాలని పూజలు చేసినట్లు పేర్కొన్నారు.
Kaleshwaram Temple: కాళేశ్వరంలో మహారాష్ట్ర మాజీ సీఎం ప్రత్యేక పూజలు - pranahitha pushkaralu latest news
Kaleshwaram Temple: కాళేశ్వర పుణ్యక్షేత్రాన్ని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ దర్శించుకున్నారు. స్వామి వారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశం సుభిక్షంగా ఉండాలని పూజలు చేసినట్లు ఫడణవీస్ పేర్కొన్నారు
Kaleshwaram Temple: కాళేశ్వరంలో మహారాష్ట్ర మాజీ సీఎం ప్రత్యేక పూజలు
ప్రాణహిత పుష్కరాల సందర్భంగా సిరోంచ వచ్చాము. అక్కడ అర్ఘ్యప్రదానంతో పాటు ప్రత్యేక పూజలు చేశాం. అక్కడి నుంచి కాళేశ్వరంలో ముక్తీశ్వర స్వామి దర్శనం కోసం ఇక్కడికి వచ్చాము. హిందూ దేవాలయాల్లో ఇదొక గొప్ప మందిరం. దేశం సుభిక్షంగా ఉండాలని పూజలు చేశాం. -దేవేంద్ర ఫడణవీస్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి
ఇవీ చదవండి: