జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ(కన్నెపల్లి) పంపుహౌస్ నుంచి నీటి ఎత్తిపోతలను తిరిగి శుక్రవారం ప్రారంభించారు. గత శనివారం మూడోదఫా మోటర్లను ప్రారంభించగా రెండు రోజులపాటు ఏకకాలంలో 11 మోటార్లను.. తర్వాత రెండు రోజులపాటు ఐదింటిని నడిపారు.
శివరాత్రి సందర్భంగా లక్ష్మీ పంపుహౌస్ 11 మోటర్లు ప్రారంభం - జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాజా వార్తలు
కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ(కన్నెపల్లి) పంపుహౌస్ మోటర్లను శుక్రవారం తిరిగి ప్రారంభించారు. మహా శివరాత్రి సందర్భంగా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్దకు వచ్చే భక్తులకు గోదావరి నిండుగా కనువిందు చేసింది.
శివరాత్రి సందర్భంగా లక్ష్మీ పంపుహౌస్ 11 మోటర్లు ప్రారంభం
బుధవారం నుంచి పూర్తిస్థాయిలో మోటర్లను నిలిపివేశారు. మహాశివరాత్రి సందర్భంగా పుణ్యస్నానాలు చేసే భక్తులకు నిండు గోదావరి కనువిందు చేయాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం తిరిగి 11 మోటర్లను ప్రారంభించి నీటిని సరస్వతి బ్యారేజీకి తరలించారు.
ఇదీ చూడండి :పాదరక్షలతో శివాలయంలోకి వెళ్లిన ఉప్పల్ ఎమ్మార్వో
TAGGED:
jayashankar bhupalpally