తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆశలు చిగురిస్తున్నాయ్‌..! లక్నవరం జలశయానికి జలకళ

లక్నవరం జలాశయానికి వరద నీరు వచ్చింది. ఎగువన కురిసిన వర్షానికి జలాశయం కొత్త రూపు సంతరించుకుంటోంది. 15 అడుగుల వరకు నీటిమట్టం చేరింది.

laknavaram lake
laknavaram lake

By

Published : Jun 19, 2020, 12:31 PM IST

భానుడి ఎండ తీవ్రతకు ముఖం వాల్చేసిన చెట్టూ చేమా తొలకరి జల్లుల మట్టి వాసనకు సరికొత్త చైతన్యంతో చివుళ్లు తొడుగుతున్నాయి. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటితో జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం జలాశయం రోజు రోజుకు కొత్త రూపును సంతరించుకుంటోంది.

వరద నీటితో జలాశయానికి జల కళ వస్తుండగా పరిసర ప్రాంతాలు పచ్చందాలతో కనువిందు చేస్తున్నాయి. అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. లక్నవరం జలాశయంలో గురువారం ఉదయానికి 15 అడుగులకు నీటి మట్టం చేరుకుంది.

ఇదీ చదవండి:మహానగరంలో కరోనా మహమ్మారి విజృంభణ..!

ABOUT THE AUTHOR

...view details