తెలంగాణను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు తొలి వసంతం పూర్తి చేసుకుంది. ఏటా 180 టీఎంసీలను ఎగువకు తరలించేందుకు ఉద్దేశించిన మహత్తర ప్రాజెక్టును 2019 జూన్ 21వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, నాటి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ ప్రారంభించారు. మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద అట్టహాసంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. రూ.85 వేల కోట్లతో నిర్మాణాలు జరిగాయి.
కాళేశ్వరం వరప్రదాయినికి సంవత్సరం పూర్తి - కాళేశ్వరం ప్రాజెక్టు వార్తలు
తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్.. జాతికి అంకితం చేసి నేటికి ఏడాది అయింది. ఇంజినీరింగ్ అద్భుతంగా అభివర్ణించే కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్నో రికార్డులను నెలకొల్పింది. ఈ ప్రాజెక్టులో మొత్తం 11 మోటార్లు 8020 గంటలు పనిచేశాయి.
kaleshwaram project
కాళేశ్వరం నుంచి కొండపోచమ్మ వరకు బ్యారేజీలు, పంప్‌హౌస్‌లు, గ్రావిటీ కాలువలు, టన్నెళ్లు, సర్జ్‌ఫూళ్లు, తదితర నిర్మాణాలు విజయవంతంగా పూర్తయ్యాయి. ప్రాజెక్టులోని తొలి, భారీ నిర్మాణమైన లక్ష్మి (మేడిగడ్డ) బ్యారేజీ నిర్మాణం అత్యంత స్వల్పకాలంలో పూర్తయి రికార్డులు సృష్టించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీన బ్యారేజీ సామర్థ్యమైన 16.17 టీఎంసీలకు నీటి నిల్వ చేరుకుంది. ఈ ప్రాజెక్టులో మొత్తం 11 మోటార్లు 8020 గంటలు పనిచేశాయి.