తెలంగాణ

telangana

ETV Bharat / state

ధరణి సేవల్లో జాప్యం ఉండకూడదు: జేసీ స్వర్ణలత - చిట్యాల తహసీల్దార్​ కార్యాలయం తాజా వార్త

ధరణి సేవల్లో జాప్యం జరుగకుండా ప్రజలకు మేలైన సేవలు అందిచాలని జయశంకర్​ భూపాలపల్లి జిల్లా జాయింట్​ కలెక్టర్​ స్వర్ణలత అధికారులను ఆదేశించారు. చిట్యాల తహసీల్దార్​ కార్యాలయంలో జరుగుతున్న ధరణి ప్రక్రియను పరిశీలించారు.

joint collector swarnalatha visit chityala tahasil office in jayashankar bhupalpally district
ధరణి సేవల్లో జాప్యం ఉండకూడదు: జేసీ స్వర్ణలత

By

Published : Nov 12, 2020, 6:31 PM IST

ధరణి సేవలను సద్వినియోగం చేసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలత అన్నారు. చిట్యాల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధరణి సర్వీసుల గురించి సమీక్ష నిర్వహించారు. జాప్యానికి తావివ్వకుండా ధరణి దరఖాస్తులను పరిశీలించి త్వరగా పట్టాదారు పాసు పుస్తకాలను అందించాలని తహసీల్దార్ షరీఫ్​ని ఆదేశించారు.

లబ్దిదారులకు పాసుపుస్తకం కాఫీ అందజేశారు. ధరణి విధానం వల్ల రైతులకు అరగంటలోపే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ కంప్లీట్ చేసి పాసుపుస్తకం అందజేస్తామని తెలిపారు. చిట్యాల మండల కేంద్రంలోని రైతువేదిక నిర్మాణ పనులను పరిశీలించి నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

ఇదీ చూడండి:'సన్నాల సాగుకు రైతులపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది'

ABOUT THE AUTHOR

...view details