భూపాలపల్లి నియోజకవర్గంలోని మొగుళ్లపల్లి మండలం పిడిసిల్ల గ్రామంలో పలువురు తెరాసలో చేరారు. భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డితో పాటు ఇతర పార్టీల నాయకులు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. గ్రామంలోని ప్రజలంతా ఒక్కతాటిపై నిలబడి తెరాసలో చేరడం శుభ పరిణామం అని ఎమ్మెల్యే అన్నారు.
భూపాలపల్లిలో తెరాసలో చేరికలు - భూపాలపల్లి వార్తలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా నియోజకవర్గంలోని మొగుళ్లపల్లి మండలం పిడిసిల్ల గ్రామంలో పలు పార్టీల నుంచి కార్యకర్తలు తెరాసలో చేరారు. భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి, వరంగల్ జిల్లా పరిషత్ ఛైర్మన్ గండ్ర జ్యోతి సమక్షంలో పలువురు తెరాస కండువా కప్పుకున్నారు.
తెరాసలో చేరికలు
తెలంగాణ అభివృద్దికై ముఖ్యమంత్రి ప్రవేశపెడుతున్న పథకాలు, కేసీఆర్ ముందుచూపు పట్ల ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నట్టు గ్రామ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయడం గొప్ప విషయం అన్నారు.
ఇదీ చదవండి:దొంగకు కరోనా ఉంటే.. వణికిపోతున్న పోలీసులు.!