లాక్డౌన్ వేళ జిల్లాలో ఏ ఒక్కరూ పస్తులతో ఉండకుండా చూడాలని జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ మహమ్ముద్ అబ్దుల్ అజీమ్ అధికారులను ఆదేశించారు. మల్హర్రావు మండలంలో పర్యటించిన కలెక్టర్... లాక్డౌన్ సందర్భంగా చేపట్టిన కార్యక్రమాలపై సమీక్షించారు.
'జిల్లాలో ఏ ఒక్కరూ పస్తులుండకూడదు' - LOCK DOWN EFFECTS
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్రావు మండలంలో కలెక్టర్ మహమ్ముద్ అబ్దుల్ అజీమ్ పర్యటించారు. ఆయా గ్రామాల్లో అమలవుతున్న లాక్డౌన్ పరిస్థితులను సమీక్షించారు. జిల్లాలో ఏ ఒక్కరూ పస్తులుండకుండ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
'జిల్లాలో ఏ ఒక్కరూ పస్తులుండకూడదు'
రుద్రారంలోని నర్సరీని పరిశీలించి... వర్షాకాలంలో నాటేందుకు మొక్కలను సిద్ధం చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. అనంతరం కొయ్యూరు పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. లాక్డౌన్ కారణంగా ప్రజలు ఆహారం కోసం ఇబ్బంది పడకుండా అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు. వలస కార్మికులకు వసతి కల్పించాలన్నారు.