గుడుంబా నిర్మూలనకు ప్రతి ఒక్క మహిళా పోలీసులా పని చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీం పిలుపునిచ్చారు. భూపాలపల్లి మండలంలోని అజాంనగర్లో గుడుంబా నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గుడుంబా మహమ్మారి బారినపడి అనేక పేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు.
'ప్రతీ మహిళా ఒక పోలీసులా పని చేయాలి' - 'ప్రతీ మహిళా ఒక పోలీసులా పని చేయాలి'
జయశంకర్ భూపాలపల్లి జిల్లా అజాంనగర్లో కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీం గుడుంబా నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గుడుంబా రహిత జిల్లాగా మార్చేందుకు మహిళలు నడుం బిగించాలని తెలిపారు.
'ప్రతీ మహిళా ఒక పోలీసులా పని చేయాలి'
జిల్లాలో గుడుంబా వల్ల ప్రజలు ఎవరు మరణాలకు గురికాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు. అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలకు మహిళలు పూర్తి మద్దతు ఇచ్చి గుడుంబా నియంత్రణకు నడుం బిగించాలని కలెక్టర్ సూచించారు.