తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులో భద్రత కట్టుదిట్టం - CORONA UPDATES

మహారాష్ట్రలో కరోనా కేసుల ఉద్ధృతిని దృష్టిలో పెట్టుకుని సరిహద్దు ప్రాంతంలో లాక్​డౌన్​ను కట్టుదిట్టం చేశారు. జయశంకర్​భూపాలపల్లి జిల్లా మహదేవ్​పూర్​ మండలంలో చెక్​పోస్టులను కలెక్టర్​ మహమ్మద్​ అబ్దుల్​ అజీమ్​ పరిశీలించారు.

JAYASHANKE BHUPALAPALLY COLLECTOR INSPECTED TELANGANA MAHARASHTRA BORDER
తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులో భద్రత కట్టుదిట్టం

By

Published : Apr 14, 2020, 8:43 PM IST

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లా పాలనాధికారి మహమ్మద్ అబ్దుల్ అజీమ్ పరిశీలించారు. కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద పరిస్థితులను కలెక్టర్ పరిశీలించారు. మహారాష్ట్రలో కరోన ఉద్ధృతి కారణంగా ఒక్కరిని కూడా రాష్ట్రంలోకి రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మేడిగడ్డ బ్యారెజీపై రాకపోకలు నిషేధంపై పరిస్థితి ఎలా ఉందని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

మహదేవపూర్ మండలంలో ఎక్కిడిక్కడే చెక్ పోస్టులు పెట్టి భద్రత కట్టుదిట్టం చేశారు. లాక్​డౌన్ దృష్ట్యా తెలంగాణ, మహారాష్ట్రకు రాకపోకలు నిషేధించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీ, కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెనపై రాకపోకలు సాగడం లేదు. ఆయా వంతెనల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు.

తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులో భద్రత కట్టుదిట్టం

ఇవీ చూడండి:పాఠాలు వల్లించే అధికారులే పట్టాలు తప్పుతున్నారు!

ABOUT THE AUTHOR

...view details