కొవిడ్ నిబంధనలు పాటించని వారిపై ఐపీసీ, విపత్తు నిర్వాహణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇంఛార్జీ ఎస్పీ సంగ్రామ్ సింగ్ హెచ్చరించారు. నైట్ కర్ఫ్యూకు సహకరిస్తున్న జిల్లా ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
'నైట్ కర్ఫ్యూకు సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు' - ఎస్పీ సంగ్రామ్ సింగ్
కరోనా రెండో దశ విజృంభిస్తోన్న నేపథ్యంలో.. వైరస్ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇంఛార్జీ ఎస్పీ సంగ్రామ్ సింగ్ పేర్కొన్నారు. మాస్కులు ధరించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజలందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.

jayashankar district covid cases
యజమానులు.. తమ దుకాణాల వద్ద ప్రజలు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడ వద్దని అన్నారు. అందరూ నాణ్యమైన మాస్కులు ధరించాల్సిందిగా సూచించారు. అవసరమైతే తప్ప బయటకు రాకూడదని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:వారం రోజుల్లో కొవిడ్ చికిత్సా కేంద్రం ఏర్పాటు: సబితా ఇంద్రారెడ్డి