జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని భక్తులు జాగరణలో ఉండి పోయారు.
కాళేశ్వర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాత్రి జాగరణలో ఉన్న భక్తులు వేకువజాము నుంచే గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు.
కాళేశ్వర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు
శుక్రవారం వేకువజాము నుంచే భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి, కాళేశ్వర-ముక్తీశ్వరా స్వామి వారి దర్శనం చేసుకుని.. స్వామి వారికి అభిషేకం చేస్తున్నారు. సాయంత్రం 4.00 గంటలకు ఆది ముక్తీశ్వరా స్వామి కళ్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.
ఇదీ చదవండి:కంటికి రెప్పలా కాపాడుకుంటే.. కనీసం పట్టించుకోవట్లేదు..!