జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇన్ఛార్జ్ కలెక్టర్ కృష్ణ ఆదిత్య జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం అదనపు ఎస్పీ శ్రీనివాస్ సమక్షంలో జిల్లా ఆర్ముడు రిజర్వ్ పోలీస్ కమాండర్లచే గౌరవ వందనం స్వీకరించారు.
భూపాలపల్లిలో ఘనంగా గణతంత్ర వేడుకలు - తెలంగాణ వార్తలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 72 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇన్ఛార్జ్ కలెక్టర్ కృష్ణ ఆదిత్య జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం అదనపు ఎస్పీ శ్రీనివాస్ సమక్షంలో జిల్లా ఆర్ముడు రిజర్వ్ పోలీస్ కమాండర్లచే గౌరవ వందనం స్వీకరించారు.
ఘనంగా గణతంత్ర వేడుకలు
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరును కృష్ణ ఆదిత్య వివరించారు. వివిధ శాఖల్లో ఉత్తమ అధికారులుగా ఎంపికైన వారికి అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ స్వర్ణలత, జడ్పీ ఛైర్మన్ జక్కు శ్రీహర్షిని, తదితర ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.