యాసంగి పంట కొనుగోళ్లకు మార్కెటింగ్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జయశంకర్ భూపాలపల్లి సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలత ఆదేశించారు. జిల్లా పాలనాధికారి కార్యాలయంలో మార్కెటింగ్, వ్యవసాయ, సహకార, పౌరసరఫరాలు, గ్రామీణాభివృద్ధి అధికారులతో సమావేశమయ్యారు. ప్రభుత్వం వరిధాన్యం కొనుగోళ్లను మార్కెటింగ్శాఖకు అప్పగించినందున ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
యాసంగి పంట కొనుగోళ్లకు సిద్ధంగా ఉండాలి: జేసీ స్వర్ణలత - జాయింట్ కలెక్టర్ స్వర్ణలత యాసంగి పంట కొనుగోళ్లపై సమీక్ష
యాసంగిలో పండించిన వరిధాన్యం కొనుగోళ్లకు సిద్ధంగా ఉండాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలత స్పష్టం చేశారు. ఈ అంశంపై జిల్లా పాలనాధికారి కార్యాలయంలో మార్కెటింగ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.
![యాసంగి పంట కొనుగోళ్లకు సిద్ధంగా ఉండాలి: జేసీ స్వర్ణలత jayashankar bhupalpally joint collector meeting with marketing officers on paddy buying arrangements of in district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10758704-509-10758704-1614165645335.jpg)
అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా సంయుక్త పాలనాధికారి కూరాకుల స్వర్ణలత
జిల్లాలో సుమారు లక్షా 50 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగా అన్నిశాఖలు సమన్వయంతో కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలన్నారు. దీనికి మిల్లర్లు కూడా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ అధికారి కనకశేఖర్, జిల్లా పౌరసరఫరాల అధికారి గౌరీశంకర్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాఘవేందర్, జిల్లా సహకార అధికారి రామ్మోహన్ రావు, డీఆర్డీవో పురుషోత్తం, జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ భాస్కర్, మిల్లర్లు, తదితరులు పాల్గొన్నారు.