తెలంగాణ

telangana

ETV Bharat / state

'వయసుకు తగ్గ ఎత్తు పెరిగేలా పౌష్టికాహారం అందించాలి' - Jayashankar Bhupalpally District Latest News

ఐసీడీఎస్ సీడీపీఓలు, అంగన్​వాడీ సూపర్​వైజర్లతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య సమావేశం నిర్వహించారు. ఐదేళ్లలోపు పిల్లలు వయసుకు తగ్గ ఎత్తు పెరిగేలా పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. మెనూ ప్రకారం చిన్నారులకు పౌష్టికాహారం అందించేలా చూడాలని అన్నారు.

Collector Krishna Aditya held a meeting with ICDS CDPOs and Anganwadi Supervisors
అధికారులతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య సమావేశం

By

Published : Mar 4, 2021, 3:24 PM IST

ఐదేళ్లలోపు పిల్లల వయసుకు తగ్గ ఎత్తు పెరిగేలా పౌష్టికాహారం అందించాలని స్త్రీ శిశుసంక్షేమశాఖ అధికారులను భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశించారు. మెనూ ప్రకారం చిన్నారులకు ఆహారం అందించేలా చూడాలన్నారు. ఐసీడీఎస్ సీడీపీఓలు, అంగన్​వాడీ సూపర్​వైజర్లతో సమావేశం నిర్వహించారు.

ఐసీడీఎస్ సూపర్​వైజర్లు అంగన్​వాడీ టీచర్ల సమన్వయంతో జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లల్ని ముఖ్యంగా వలస కార్మికుల, ఇటుక బట్టీల ప్రాంతాల్లో ఉండే బాలల వివరాలు సేకరించాలన్నారు. ఎత్తు కొలిచి వయసుకు తగ్గట్టుగా లేని వారిని గుర్తించి పౌష్టికాహారం అందించి ఆరోగ్యంగా పెరిగేలా చూడాలని పేర్కొన్నారు.

మెనూ ప్రకారం..

ప్రతి అంగన్​వాడీ సూపర్​వైజర్ తప్పకుండా వారి పరిధిలోని కేంద్రాలను పరిశీలించి చిన్నారులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించేలా చూడాలన్నారు. అంగన్​వాడీ కేంద్రాలు, స్త్రీ, శిశు సంక్షేమశాఖ భవనాలు, మానవ వనరుల వివరాలు అందజేయాలని జిల్లా సంక్షేమ అధికారి శ్రీదేవిని ఆదేశించారు.

మల్హర్రావు, మహాముత్తారం, మహాదేవపూర్, పలివెల మండలాల్లోని అంగన్​వాడీ సూపర్​వైజర్లకు ప్రయాణానికి స్కూటీలు అందించే ఏర్పాటు చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో భూపాలపల్లి, మహాదేవపూర్ సీడీపీవోలు అవంతి, రాధిక, పోషన్ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ యోచన పాల్గొన్నారు.

ఇదీ చూడండి:యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు పరిశీలించిన కేసీఆర్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details