తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఈవీఎంల గోడౌన్ వద్ద గట్టి భద్రత ఏర్పాట్లు చేయాలి' - Jayashankar Bhupalpally District Latest News

ఈవీఎంల గోడౌన్ వద్ద గట్టి భద్రత ఏర్పాట్లు చేయాలని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశించారు. జిల్లా కేంద్రం క్రిష్ణ కాలనీలోని అంబేద్కర్ స్టేడియం గదుల్లోని ఈవీఎంలను రాజకీయ పార్టీల సమక్షంలో పరిశీలించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం రక్షణ కల్పించాలని సెక్యూరిటీ సిబ్బందికి తెలిపారు.

Collector inspecting security arrangements at EVMs godown
ఈవీఎంల గోడౌన్ వద్ద భద్రత ఏర్పాట్ల పరిశీలనలో ‌ కలెక్టర్

By

Published : Jan 28, 2021, 2:20 PM IST

ఈవీఎంల గోడౌన్ వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేయాలని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశించారు. క్రమ పద్ధతి ప్రకారం వాటిని అమర్చి భద్రపరచాలని ఎన్నికల అధికారులకు తెలిపారు. జిల్లా కేంద్రం క్రిష్ణ కాలనీలోని అంబేద్కర్ స్టేడియం గదుల్లోని ఈవీఎంలను రాజకీయ పార్టీల సమక్షంలో పరిశీలించారు.

ఈవీఎంలు ఉంచిన గదులకు మళ్లీ సీల్ వేశారు. వాటిని క్రమ పద్ధతిన అమర్చాలని ఎన్నికల అధికారులను ఆదేశించారు. గోడౌన్ భద్రతకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజ్​లను పరిశీలించారు.

ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం గట్టి రక్షణ కల్పించాలని సెక్యూరిటీ సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు. కార్యక్రమంలో భూపాలపల్లి ఆర్డీవో శ్రీనివాస్, ఎలక్షన్ డీటీలు రవి కుమార్, రవి, ఆర్ఐ దేవేందర్, సాంకేతిక నిపుణులు నవీన్, రాజకీయ పార్టీల ప్రతినిధులు రాజయ్య, రాజబాబు, దేవన్, భరత్ కుమార్, కిరణ్, సురేష్, నిరంజన్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి:నడిరోడ్డుపైనే లంచం తీసుకున్న ఏఈ.. అరెస్టు చేసిన పోలీసులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details