తెలంగాణ

telangana

ETV Bharat / state

'విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించాలి' - జయశంకర్ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసులు తాజా

పెండింగ్​లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ వి.శ్రీనివాసులు అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో జిల్లా స్థాయి పోలీసు అధికారులు, కోర్టు ఆఫీసర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

jayashankar bhupalpally district additional sp srinivasulu conduct a meeting with district level police officials
'విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించాలి'

By

Published : Feb 10, 2021, 5:22 PM IST

కోర్టు డ్యూటీ ఆఫీసర్లు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ వి.శ్రీనివాసులు అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో జిల్లా స్థాయి పోలీసు అధికారులు, కోర్టు ఆఫీసర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పెండింగ్​లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న ఆయన కేసుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్​లైన్​లో నిక్షిప్తం చేయాలని సూచించారు.

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని సిబ్బందికి అదనపు ఎస్పీ సూచించారు. నేరస్థులకు శిక్ష పడే విధంగా కృషి చేసి ప్రజలలో పోలీసులపై మరింత నమ్మకాన్ని పెంపొందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్​స్పెక్టర్లు వాసుదేవరావు, హథీరామ్, మోహన్, శ్రీనివాస్, సైదారావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:'నమ్ముకున్న పొలమే కాటేసిందానే.. అన్న'

ABOUT THE AUTHOR

...view details